ఆoజనేయస్వామి సింధూర ప్రియుడెందుకు::స్వామిని మంగళవారం లేదా శనివారం కొలుచుటకు గల కారణం

పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి, నుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం' పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో, అప్పటి వరకూ శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు.
ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా,
సీతాదేవి హనుమంతునితో‘మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము, నీవు రాకూడదు, వెళ్ళు హానుమా...తరువాత రావచ్చు' అనెను.
రాములవారు కూడా ‘సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా..ఇప్పుడు రావద్దు..'అనెను.
అంతట ఆంజనేయుడు ‘రామా! మిమ్ములను సేవించనిదే నాకు కునుకు పట్టదు కదా...మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులై పోతిరేమి రామ''అనగా,
రాములవారు హనుమంతునితో‘నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరం పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని' అని తెలిపాడు. హనుమంతుడు ఆశ్చర్యంతో ‘అమ్మా! మీ నుదుట తిలకముంది కదా!పాపిటన సింధూరం దేనికి' అని అడిగాడు.
అప్పుడు సీతాదేవి‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని' చెబుతుంది.
వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందులేకుండా సింధూరం రాసుకొని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు.
హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా ముసిముసినవ్వులు నవ్వుతుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి ‘హనుమా! ఇదేమిటి‘ అని అడగగా, హనుమంతుడు ‘మీరు చిటికెడు సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ఆమెకు వశపడితిరి కదా, చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించుకున్నాను. మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కాదా" అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు.
హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా ‘ఆంజనేయా! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతే కాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు, సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి'అని వరదానం చేశాడు. భక్త జనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయస్వామి. అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు.

శ్రీ వైభవలక్ష్మి

లక్ష్మీ దేవి అమ్మవారు భృగు మహర్షి కూతురుగా జన్మిస్తుంది... భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును అనుగ్రహం చేసుకుని అల్లుడిగా పొంది తరిస్తాడు.. ఒకానొక సమయంలో భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనేదానిని తెలుసుకోవడం కోసం వైకుంఠం చేరుకుంటారు.. అప్పుడు పాచికలాటలో నిమగ్నమైఉన్న శ్రీరమా రమణులు మహర్షి రాక గమనించరు.. దానిని అవమానంగా భావించిన మహర్షి కోపం పట్టలేక శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని పాద తాడనం చేస్తాడు... తన్నింది తన తండ్రే అయినా... అవమానం పడింది తన భర్తే అయినా తట్టుకోలేక పోయింది శ్రీ మహాలక్ష్మి... అందుకే తన నివాస స్థానమైన భర్త వక్షస్థలాన్ని తన్నినందుకు.. దానిని భరించిన విష్ణుమూర్తి పై కినిసిందా మహాతల్లి.. (అందుకే లక్ష్మీదేవి పట్ల ఎప్పుడూ తక్కువ చేయకూడదు..)శ్రీమహావిష్ణువు తన భార్యకోసం అలమటించి.. ఘోర తపస్సు చేయగా... క్షీరసాగర మథనంలో తిరిగి జన్మిస్తానని తెలిపి..క్షీరసాగర మధన కాలంలొ లక్ష్మీదేవి అష్టలక్ష్మిగా ఆవిర్భవించింది. ఆదిలక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజ యలక్ష్మి, విద్యా లక్ష్మీ, ధనలక్ష్మి, ఈ ధనలక్ష్మియే వైభవలక్ష్మి. ఇహపర లోకంలో సకలసంపదలను ప్రసాదించే అమ్మవారి స్వరూపమే శ్రీ వైభవ లక్ష్మిదేవిగా ఆవిర్భవించింది. ఈ తల్లి దయవల్ల మానవులు పొంద లేనిదేదీ ఉండదు అని సూతమహర్షి వివరించాడు.

పూర్వకాలమున అమృతము కొరకు దేవతలు, రాక్షసులు పాలసముద్రమును చిలుకు సమయమున ముందుగా లక్ష్మీదేవి పాలసముద్రము నుండి ఉద్భవించిన. అందుకే ఆమె క్షీరరాజతనయ అని పిలవబడుతున్నది. తరువాత కామధేనువు,కల్పవృక్షము హాలాహలము,చివరిగా అమృతము లభించినవి.ఈ విధంగా ఉద్భవించిన శ్రీమహవైభవలక్ష్మిని మనసారాపూజించిన సకల జనులకు ఈ జన్మమునసర్వసుఖములు పరమందు మోక్ష సిద్ధి కలుగుతాయి. కరుణావీక్షణము చేతనే సకల సౌఖ్యముల సమకూర్చగల శ్రీ వైభవలక్ష్మి వైకుంఠమున శ్రీమహావిష్ణువు పై కినుక వహించి,భూలోకమున అవతరించినది.తన హృదయాన్నే శ్రీకి నిలయం చేసుకున్న మహావిష్ణువు,ఆ తల్లిని విడచి వుండలేక తానునూ భూలోకమునకు విచ్చేసినారు.సర్వార్ధసిద్ధికి,సకల వరసిద్ధికి,కారణభూతులయిన వీరిరువురూ,భక్తి ప్రపత్తులు గల మానవకోటికి సిరిసంపదలు,సకల సౌఖ్యములను లభింపచేయుటకే,కారణములు కల్పించుకుని భూమిపై అవతరించిరి.అదే ఆ జగన్మోహనుల లీల,ఘటనాఘటన సమర్ధులు కనుక మానవాళికి సౌఖ్యములు ప్రసాదించుటకు సంకల్పించిరి.అహంకారము,తిరస్కార భావములు కలవారికి మాత్రము వీరు అనుగ్రహము కలుగుట అసంభవము. ఇది నిస్సంశయము. 

నీవు తప్ప నాకెవ్వరు దిక్కని స్తుతించిన వారికి అన్నిటా ఆవైభవలక్ష్మితోడై అండగా నిలుస్తుంది.
భాగ్యం కోసం ఆ తల్లిని ఆరాధించిన వారికి,ఆ మాత భోగభాగ్యములను ప్రసాదించే సకల వరప్రదాయిని అవుతుంది.
నిస్సంతులు పుజించినచో సంతానలక్ష్మిగా తన అనురాగమును సంతానమును కలిగించును.
విజయము కొరకు ప్రార్ధించిన జయలక్ష్మి అయి విజయాన్ని కలిగిస్తుంది.
పాండిత్యము కొరకు పూజించిన వారికివిద్యాలక్ష్మిగా సర్వశాస్త్ర పారంగతులను చేసే తల్లి.
ధనము కొరకు పూజించే వారికి ధనలక్ష్మి కోరికలు నెరవేర్చే కరుణామూర్తి.
పంటలు లేక బాధపడేవారు పూజించిన,ధాన్యమునిచ్చు ధాన్యలక్ష్మి.

పిరికితనము పొకొట్టు దైర్యలక్ష్మి నిత్యజీవితావసరాలను ఆశించి ప్యజించువారికి అండగా నిలిచి కాపాడే ఆదిలక్ష్మి.
ఆ తల్లి యెక్క అష్టరూపాలను ఎవరైతే భక్తిగా,శ్రద్ధగా నియమములతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆ తల్లి యెక్క అనుగ్రహము లభిస్తూందనటలో సంశయము లేదు.అష్టలక్ష్మి పూజను చేసి లక్ష్మి పూజాకధను విని,ప్రసాదమును స్వీకరించిన వారి కోరికలు తప్పక నెరవేరగలవు.
అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి రస్తుః

చాణక్యుడు/కౌటిల్యుడు

భారతదేశపు ఖ్యాతి విశ్వవ్యాప్తం చేయడానికి... తక్షశిల విశ్వ విద్యాలయంలో ఒక ఆచార్యుడు... అర్థ శాస్త్రాన్ని బోధించేవాడు.. రెండువేల ఏళ్ళ క్రితమే అర్థశాస్త్రాన్ని రచించినవాడు... ఇప్పటికీ ఈయన సూచించిన సూత్రాలనే అందరూ అనుసరిస్తున్నారు... (రెండువేల ఏళ్ళక్రితమే తక్షశిల విశ్వవిఖ్యాతి గాంచిన ఒక ప్రస్తిద్ధ విశ్వవిద్యాలయం.. ఇక్కడ దేశ విదేశాలలోని కొన్ని వేల మంది విద్యను అభ్యసించే వారు....) భరత ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేయడానికి భారత దేశంలో మౌర్య సామ్రాజ్యస్థాపనకు కారణమైన వాడు చాణక్యుడు... ప్రస్థుతం మనందరికీ తెలిసిన అర్థశాస్త్రాన్ని రచించిన వాడు.. చాణక్యుడు... ఒక మనిషి ముక్తిని పొందేందుకు పాటించిఅవలసిన చతుర్విధ ధర్మాలలో (ధర్మ, అర్థ, కామ, మోక్షములు) అర్థము అనేదానికి నిజమైన అర్థాన్ని మనకు తెలిపినవాడు చాణక్యుడు..
క్రీ.పూ.320 సంవత్సరాల క్రితం మాట అది. అరవై నాలుగు ద్వారాలతో, అష్టఐశ్వర్యాలతో అలరారుతుంది పాటలీ పుత్ర నగరం. నగరానికి ఈశాన్యంగా పవిత్ర గంగానది ప్రవహిస్తూ వుంది. ప్రాతః కాలంలో గంగాస్నానం చేసి, నుదురుపై తిలకం దిద్ది వస్తున్నాడొక నల్లబ్రాహ్మణుడు. దారిలో అతని కాలికొక దర్భములు(ముల్లు) గ్రుచ్చుకొంది. తక్షణం దానిని కాల్చి తన చెంతనున్న రాగి చెంబులోని నీళ్ళతో కలిపి గుటగుట త్రాగేశాడతను. ఏదో ఘనకార్యం చేసిన వానిలా సంతృప్తుడై త్రేంచాడు. ఈ విచిత్ర సంఘటనకు విస్తుబోయిన యువకుడొకడు అతన్ని సమీపించి, స్వామీ! అదేమన్నా ఔషధమా? అలా సేవించారే - అని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు జరిగిన విషయం చెప్పి, దాని పొగరు అణచడానికే కాల్చి బూడిద చేసి సేవించాను. శత్రుమరణం వలన శాంతి కలుగుతుంది. ఒక విధంగా అది ఔషధమే అయింది అన్నాడు. అచేతనమైంది ముల్లు. దానికి మిత్ర శుత్రుత్వాలు లేవు. ఇంత క్రూరదండన భావ్యమా? అని అడిగాడు యువకుడు.
మనస్తాపం కలిగించినపుడు చేతనాచేతన బేధం పాటించి అవమానాన్ని సహించడం ధీరుల లక్షణం కాదు. వెధవది ముల్లే గదా అని వదిలేస్తే అది మరలా ఇంకొకరికి కష్టపెట్టే ప్రమాదముంది. ఇందుమూలంగా లోకోపకారమే జరిగింది కదా! అన్నాడా బ్రాహ్మణుడు. అపరాధి విషయంలో చేతనా అచేతనా బేధం పాటించనన్నారు సరే అపరాధి అవక్ర విక్రముడైన ఏ మహరాజో అయితేనో? అని అడిగాడు యువకుడు. అతనొకమారు ఆ యువకుని ముఖంలోకి నిశితంగా జూచి బాలకా! నా శక్తిసామర్థ్యాలు నీకు తెలియవు. అవమానం చేసినోడు అవనీపతైనా ప్రతీకారం చేసి పగ తీర్చుకుంటాను. కేరళ నా జన్మభూమి. నా పదమూడవ యేటే ఆ పుణ్యభూమిని వదిలాను. ఆ రెండు కాశిలో వేదాధ్యయనం చేశాను. మరో ఆరేండ్లు తక్షశిలలో ఆయుర్వేదం రాజనీతి అర్ధశాస్త్రం అధ్యయనం చేశాను. నా ధర్మబలం ముందు ప్రభువుల చతురంగ బలాలు చప్పబడాల్సిందే అన్నాడు నిబ్బరంగా.
ఈ కలికాలంలో ధర్మానికింకా అంత బలముంటుందా స్వామి? వినయంగా ప్రశ్నించాడా యువకుడు. ధర్మకవచం తొడుక్కున్న స్వార్ధపరులకు ధర్మం సహకరించకపోవచ్చు. కానీ, ధర్మపరుడ్ని ధర్మమే రక్షిస్తుంది. ధర్మరక్షణ కొరే నేను తక్షాశిలను వదిలిరావలసి వచ్చింది అన్నాడు బ్రాహ్మణుడు. సంభ్రమాశ్చర్యాలతో తలమునకైనాడా యువకుడు. తక్ష శిలాధీశుడు ధర్మచ్యుతుడై యువకుడైన అలెగ్జాండరుతో చేతులు కలిపి ఈ పవిత్ర భారతావనికి తీరని ద్రోహం చేశాడు. యువకుల ప్రాబల్యం నుంచి ఈ దేశాన్ని కాపాడే ప్రభువును వెదుక్కొంటూ ఈ మగధదేశం ప్రవేశించాను అన్నాడు బ్రాహ్మణుడు. అతని ఆశయానికి పులకాంకితుడైన ఆ యువకుడు భక్తిపారవశ్యంతో అతని ముందు మోకరిల్లి తనను పరిచయం చేసుకొన్నాడు.
వారిరువురికి సఖ్యత కుదిరింది. తన నవమానించిన నవనందులను నాశనం చేసి నంద సామ్రాజ్యాన్ని క్రూకటివేళ్ళతో కూలద్రోచి ఆ యువకునికి సామ్రాజ్యాన్ని కట్టాడా బ్రహ్మ తేజస్వి. అతనే అర్ధశాస్త్రాన్ని మనకందించిన రాజనీతిజ్ఞుడు చాణక్యుడు. క్రీ.పూ. 322లో మౌర్యసామ్రాజ్య స్థాపన జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక సంఘటన. ఆ వంశస్థాపకుడైన మౌర్య చంద్రగుప్తుడు ఆ యువకుడే. చాణక్యుని రాజతంత్రమే మగధసామ్రాజ్యానికి రక్షణ వలయంలా పాలించాడు చంద్రగుప్తుడు. అలెగ్జాండర్‌దండయాత్ర అనంతరం అతని సేనాని సెల్యూకస్‌మరలా భారతదేశం మీదకు దండెత్తి రాగా అతడ్ని బంధించాడు. భారతీయుల ప్రజ్ఞాపాటవాన్ని దేశ దేశాలకు చాటాడు. కయ్యానికి వచ్చిన గ్రీకులతో వియ్యమంది భారత గ్రీకు సంబంధాలు మెరుగుపరిచాడు.
అప్పటినుండే మన భారతీయుల ఖ్యాతి దిగదిగంతాలకు వ్యాపించింది.. మన ఓడలు అన్ని ఖండాలకు చేరి మన వస్త్ర, ఆభరణాలను అందరికీ పరిచయం చేసేది... అలా పర్షియన్లు, అరబ్బులు మన దేశం మీదకు దండెత్తడానికి వారి ద్వారా ఆంగ్లేయులు మన దేశం మీదకు రావడానికి కారణం... మన ఆధ్యాత్మిక, విజ్ఞాన సంపదే..

భారత జ్యోతిష్య/ఖగోళ శాస్త్ర పితామహుడు:: వరహ మిహిరుడు

మనకు తెలియని ఎన్నో శాస్త్రాలను పరిచయం చేసారు.. ఆరోజుల్లో వారు చేసిన శాస్త్ర పరిశోధనలు ప్రస్తుతం ఎన్ని వందల డాక్టరేట్ లు ఇచ్చినా సరిపోవు.. వాటిలో మచ్చుకు కొన్నిటి పరిచయం.. ఈ టపాలో...
ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నా లో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త ఆర్యభట్టు ను కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంధాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
జలార్గళ శాస్త్రమంటే తెలుసా?? భూమ్మీద ఎక్కడెక్కడ నీరు దొరుతుందో తెలిపే శాస్త్రం. ఆయన రాసిన ‘బృహత్సంహిత’ లో ఈ జలార్గళ శాస్త్రం కేవలం ఒక అధ్యాయమట. అసలు గ్రంథం బృహత్సంహిత ఇంకెంత గొప్పగా ఉండేదో...
ఈ శాస్త్రంలో మనకు తటాకాలు/బావులు వగైరాలు ఎన్ని రకాలు? ఎలాంటి ‘లక్షణాలు’ ఉంటే తటాకం అంటారు? ఎలాంటి లక్షణాలు ఉంటే ‘పుష్కరిణి’ అంటారు? ‘కూపం’ అని ఎప్పుడంటారు? ఇలాంటివి చెప్పాక, నీరు ఎలా ఉన్నా కూడా ‘వంకమద్ది చెట్టు పట్టతుంగగడ్డలు, వట్టివేళ్ళు ఎండబెట్టి చూర్ణము చేసి అట్టి జలాశయములలో వైచిన అవి మధురజలంబులగును’ అనే పద్యం చూస్తే ఎలాంటి నీటినైనా సరే మధుర జలాలుగా మార్చవచ్చని తెలుస్తుంది.. నేటి మినరల్ వాటర్ సంస్కృతి ఏనాటి నుండో ఉండేదన్నమాట....!!
మానవుల శరీరంలో రక్త ప్రసరణకు రక్తనాడులు ఉన్నట్లే భూగర్భంలో నీటి ప్రవహం కోసం జలనాడులుంటాయనీ, అవి గుర్తించడానికి మామూలు మనుషులకి ఉపయుక్తమౌతుందని ఈ పుస్తకం రాసానని వరహమిహురుడు చెప్పాడు ఒక శ్లోకంలో. భూమ్మీదకి పడే నీరు ఒకే రంగు, రుచి కలదైనా, ఎక్కడ పడింది? అన్నదాన్ని బట్టి దాని రంగూ,రుచీ మారతాయి. కనుక, భూవిశేషముల గురించిన ఎరుకతో బావులు తవ్వాలి అని మిహిరుడి అభిప్రాయం. ఇక, జలనాడులు ఏవో, వాటిలో ప్రధానమైనవి, అధిక జలాలు కలిగేవీ ఏవో చెప్పారు.
తరువాత నుండి, ఎక్కువ నీరు ఉండే ప్రాంతాన్ని గుర్తించే సూచనలతో నిండింది పుస్తకం. ఉదాహరణకు:
శ్లో: “జంబూవృక్షస్య ప్రాగల్మీకో యధి భవేత్సమీవస్థః,
త్స్మాద్ధక్షిణపార్శ్వే సలిలం పురుష్వయే సాధు” (తొమ్మిదో శ్లోకం)
-అంటే నిర్జల ప్రదేశంలో ఉన్న నేరేడు చెట్టుకు తూర్పు దిక్కులో పుట్ట ఉంటే, దానికి దగ్గర్లో దక్షిణాన రెండు పురుష ప్రమాణములలోతు తవ్వితే అక్కడ అతి మధురమైన జలనాడి ఉంటుందట. (పురుష ప్రమాణము అంటే దాదాపు పది అడుగులంట)
ఇలా ఇతర చెట్ల కింద, లేదంటే ఇతర సందర్భాల్లో, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో వివిధ శ్లోకాల్లో చెప్పారు. సగం పైగా ముగిశాక, ‘ఇప్పటి దాకా సారస్వత మహాముని చే చెప్పబడిన జలార్గళ శాస్త్రమును చెప్పితిని. ఇప్పుడు మనువుచే చెప్పబడిన జలార్గళ శాస్త్రమును చెప్తాను అని చెప్పి, మరి కొన్ని సూచనలు ఇచ్చారు. అలాగే, బావులు గట్రా తవ్వుతున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అడ్డం పడొచ్చు. వాటిని ఎలా పగులగొట్టాలో కూడా ఈ పుస్తకంలో చెప్పారు. అలాగే, చివరగా, చెరువులు ఎలా నిర్మిస్తే ఎక్కువ కాలం మన్నుతాయో, చెరువుల చుట్టూ ఎలాంటి వృక్షాలు పెంచాలో కూడా చెప్పారు. బావి తవ్వడానికి ఏ నక్షత్రాలు అనుకూలమో, ఏ దిక్కుల్లో తవ్వాలో కూడా చెప్పి ముగించారు. చివర్లో తవ్వడానికి ఉపయోగించవలసిన ‘జువ్వి పంగల పుల్ల’ ఎలాంటిది ఉండాలో చెప్పారు
ఈ అధ్యాయములోని విషయాలు అధారముగా ప్రస్తుతం వేగంగా పరిశోధనలు చేయుట జరుగుతుంది. భూగర్భ లోహం కనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు. చెట్లు,ఆకులు పరిశీలించి వీటి అంచనాయే గాక, ఖనిజ సంపత్తిని అంచనా వేసే క్రొత్త శాస్త్రము ఈ అధ్యాయం ఆధారంగా ఉధ్బవించింది

విష్ణుషోడశనామ స్తోత్రము

ఔషధే చింతయేద్విష్ణుం భోజనే చ జనార్ధనమ్‌,
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిమ్‌

యధా (యుద్ధే) చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమమ్‌,
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే.

దుస్స్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్‌,
కాననే నారసింహం చ పావకే జలశాయినమ్‌.

జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనమ్‌,
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవమ్‌.

షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్‌,
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకే మహీయతే

|| ఇతి శ్రీ విష్ణుషోడశనామస్తోత్రం సంపూర్ణమ్‌ ||

మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయభో హరే!!

Photo: మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక శత్రూన్ సంహార మాం రక్ష  శ్రియం దాపయభో హరే!!

కోవేలలోని అద్భుతములు

పూర్వ కాలంలో కోవెలలు నిర్మాణిమ్చేటప్పుడు ఒక ప్రేత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించినారు. అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుండినది. ఉదాహరణకు కొన్ని చూద్దాము
౧. ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజ స్వామి
౨. కుంబకోణంలో ఐరావతేస్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాల గొప్పగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుంచి చూస్తె వాలి సుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది కొచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడి వుంది. ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె శ్రీ రాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా తెలుస్తుంది.
౩. ధర్మపురి (తమిళనాడు) మల్లికార్జున స్వామీ కోవెలలో నవంగా మంటపం అంటే తొమ్మిది స్తంభముల మంటపం అన్నమాట. ఇందులో రెండు స్థంబములు భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటుంది.
౪ కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే వూరిలో కదంబవననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ట గావింపబడి వున్నది
౫ గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇచ్చేది కుంబకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో
౬. కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది. అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి రాను రాను ఎనమిది పడుహారు ముప్పైరెండు బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసే బరువు అయిపోతుంది మరి స్వామీ గుడిలోనికి పోఎత్తప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమట పట్టడం కూడా ఒక విచిత్రమే.
౭ చెన్నై సమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ మూల స్థానంలో విగ్రహం శిల కాదు పంచలోహ విగ్రహము కాదు కేవలం కుకుమపూవు పచ్చ కర్పూరం మూలికలతో చేసినది.
౯. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో ఒక బిల్వ చెట్టు స్థలవ్రుక్షం ఆ చెట్టులో కాచే బిల్వ కాయలు లింగాకారంలో వుంటుంది
౧౦ కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది అందుకే ఆ కోవేలని పంచవర్నేస్వరుడు కోవెల అని పిలుస్తారు
౧౧. విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు
౧౨. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీ రామ సన్నిధిలో శ్రీ రామును పాదములు ఒకే ఎత్తులో వుండడం
౧౩. వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరికోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే నీడ ఈ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం
౧౪. చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారం నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది
౧౫, ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామీ అనే విష్ణు గుడిలో నవగ్రహములు స్రీ రూపముతో వుంది
ఏలా మనకు తెలియని ఎన్ని ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమ విధానంగా కట్టిన కోవెలలో వుంది

Photo: కోవేలలోని అద్భుతములు 

ఈనాటి తపస్సు

తపస్సు అనగానే అడవులలోనూ, కొండ గుహలలోనూ, హిమాలయాలలోనూ సాధనాలు చేసే యోగిపుంగవులే గుర్తుకు రావడం పరిపాటి. తండ్రి ప్రేమనూ, రాజ్యాన్నీ పొందడానికి ధ్రువుడు తపస్సు చేశాడు. శివుణ్ణి పొందడానికి పార్వతీ, పాశుపతాస్త్రం కోసం అర్జునుడూ తపం ఆచరించారు. ఏదైనా ఒక వస్తువును పొందడానికి, లేదా లక్ష్యాన్ని సాధించడానికి చేసే తీవ్ర కృషినే తపస్సుగా చెప్పవచ్చు. "ఛాత్రాణాం అధ్యయనం తపః" - విద్యార్థికి చదువుకోవడమే తపస్సు. ఒక వ్యాపారి తన వ్యాపారాన్ని విస్తరించడానికి అకుంఠిత దీక్ష కలిగి ఉండడాన్నే తపస్సుగా చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మికతకు వచ్చేసరికి, "ణా తపస్వినో యోగః సిద్ధ్యంతి" - తపస్వి కాని వాడికి యోగం సిద్ధించదు. మనఃశరీరాలను వశం చేసుకొని, వాటిని యథేచ్ఛగా సంచరించనీయకుండా ఉచితరీతిని నిరోధించడమే తపస్సుగా స్వామి వివేకానంద నిర్వచించారు. తైత్తిరీయ ఉపనిషత్తు శంకర భాష్యంలో "మనసశ్చ ఇంద్రియాణామ్ చ హైకాగ్ర్యం పరమం తపః" - మనస్సునూ, ఇంద్రియాలనూ వశంలోకి తీసుకురావడమే తపస్సు అన్నారు. అసలు 'తపః' అంటే కొలిమిలో పెట్టి కాల్చడం; భూమిని త్రవ్వి తీసిన ముడి లోహాలను కాల్చి, పరిశుద్ధమైన లోహాలుగా మార్చడం. అదేవిధంగా ఆధ్యాత్మిక సాధకుడు తపస్సు ద్వారా మనస్సులో ఉన్న మలినాలను తొలగించి పరిశుద్ధం చేయడానికి ఈ తపస్సు ఉపయోగపడుతుంది. 'ఎవరు విజ్ఞానవంతుడో - వశీకృతమైన మనస్సు కలవాడో, సదా పరిశుద్ధుడో అతడు పునర్జన్మ రహితమైన ఆ పరమపదాన్ని చేరుకుంటాడు' అని కఠోపనిషత్తు చెబుతోంది. భగవద్గీత 17వ అధ్యాయంలో శారీరక, వాచిక, మానసిక తపస్సుల గురించి శ్రీకృష్ణుడు తెలియజేశాడు. దేవతలనూ, గురువులనూ, తత్త్వవేత్తలనూ పూజించడం, శుచిత్వం, సత్ప్రవర్తన, బ్రహ్మచర్యం, అహింసలను శారీరక తపస్సుగా పేర్కొన్నాడు. ఇతరులకు భయాన్నీ, కష్టాన్నీ కలిగించకుండా, వినడానికి కష్టం కలిగించని సత్యవాక్యం, వేదాభ్యాసాలను వాచిక తపస్సుగా తెలిపాడు. చిత్తశుద్ధి, కనికరం, వాక్ నిరోధం, మనఃనిరోధాలను మానసిక తపస్సుగా శ్రీకృష్ణుడు వివరించాడు. విచక్షణతో, శాంత స్వభావంతో, దయ, ప్రేమలను కలిగి ఉండే మనిషి మంచి పనులు చెయ్యగలుగుతాడు. తద్వారా తనకు తానూ మంచి చేసుకోగలుగుతాడని స్వామీజీ చెప్పారు. హనుమంతుడు శ్రీరామునితో ఏర్పడిన మొదటి పరిచయంలోనే ఆయన మెప్పును పొందాడు. శ్రీరాముడికీ, సుగ్రీవుడికీ మైత్రి కలిపాడు. రామాయణంలో హనుమంతుడి పాత్రను గమనించినట్లయితే ఎవరితో ఏవిధంగా మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం చూస్తాం. స్వామి వివేకానంద చికాగో సర్వమత మహాసభలలో కేవలం "సోదర సోదరీమణులారా" అన్న ఒక్క మాటతో మొత్తం ప్రపంచాన్నే జయించారు. స్వామీజీ వాక్చాతుర్యం మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమనుంచి పుట్టుకొచ్చింది. ఆయన మాట్లాడిన దానికి ప్రతిస్పందన కూడా అనూహ్యంగా వచ్చింది. శ్రీశారదాదేవి అవధులు లేని ప్రేమ చెడ్డవారిని సహితం సంమార్గుల్ని చేసేది. మాట్లాడడం కూడా ఒక కళే. మాట్లాడడం ఒక్కటే సరిపోదు. ఎవరికీ హాని కలిగించకుండా మాట్లాడాలి. ప్రేమతోనూ, ఆప్యాయతతోనూ మనం చెప్పదలచుకున్న దాన్ని చెబితే, అది ఇతరులకు నచ్చేలా, సంతోషం కలిగించేలా ఉంటుంది. కలియుగంలో మనిషి అన్నగత జీవి. అడవులలోనూ, గుహలలోనూ సాధనాలు చేయలేరు కనుక కేవలం సత్యాన్ని ఆచరించడమే ఈ కలియుగంలో తపస్సు అని శ్రీరామకృష్ణులు చెప్పారు. అంతేకాకుండా ఆయన స్వయంగా సత్యపాలన చేసి చూపించారు కూడా!

Photo: ఈనాటి తపస్సు:

భక్తులు ఎక్కడ ఉంటే రాముడు అక్కడ ఉంటాడు. ఇది సత్యం.

ఈశ్వరుడు ఎక్కడో ఉండడు. గుళ్ళో ఈశ్వరుడు ఉంటాడు అన్నమాట యదార్థమే. కానీ నిజంగా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? బాగా గుర్తు పెట్టుకోండి. హృదయంలో ప్రతి ఊపిరిలో ఆయన ఆరాదిస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడో, ఎక్కడ నిలుచుంటాడో, ఎక్కడ తిరుగుతాడో ఆయన వెంటనే తిరుగుతూంటాడు ఈశ్వరుడెప్పుడూ. రాముడు ఎక్కడుంటాడు అని చెప్తారో తెలుసా శాస్త్రంలో. రామచంద్రమూర్తిని నమ్ముకొని బ్రతుకుతున్నవాడు ఎక్కడ ఉంటాడో రాముడు అక్కడే ఉంటాడు. ప్రక్కనే ఉంటాడుట ధనుర్ధరుడై. ఆయన కూర్చుంటే కూర్చుంటాడు, నిలుచుంటే నిల్చుంటాడు, ఆయన వెడుతూంటే వెళతాడు. ఆయన పడుకుంటే గుమ్మం ముందు కూర్చుంటాడట. ఎందుకంటే ఆయనకి ఇబ్బంది ఎవరైనా కల్పిస్తారేమో అని. రామచంద్రమూర్తి తనను నమ్మిన వాళ్ళను రక్షించడానికి గడప ముందుకొచ్చి కూర్చుంటాడు అని. అందుకే రాముణ్ణి నమ్ముకున్న రామభక్తులెక్కడ ఉంటారో అక్కడే సీతారామలక్ష్మణులు, హనుమ కూడా ఉంటారు. ఇది తులసీదాసు గారి జీవితంలో నిజమైంది. ఆయన రామదర్శనం అవ్వాలి అనుకుంటూ పడుకుంటే దొంగ వచ్చి లోపలికి వెళ్ళి దొరికినవి మూట కట్టుకొని బయటకు వద్దాం అనుకున్నాడు. తల బైట పెట్టాడు. రామలక్ష్మణులిద్దరూ కోదండాలు పట్టుకొని నిల్చొని ఉన్నారు. నన్ను నమ్ముకున్న వాడి సొత్తు ఎత్తుకు పోతావా నువ్వు అని. ఆయన వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని వెనక్కి వచ్చాడు. తెల్లవారే వరకు తల బైట పెడుతున్నాడు, లోపల పెడుతున్నాడు. రామలక్ష్మణులు ఇద్దరూ అలాగే ఉన్నారు. తెల్లవారింది. తులసీ దాసు గారు నిద్రలేచారు. దొంగ మూటకట్టుకొని కూర్చుని ఉన్నాడు. నువ్వు ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అని అడిగారు. బుద్ధి గడ్డితిని దొంగతనానికి వచ్చాం. అన్నాడు. పట్టుకెళ్ళపోయావా? అన్నారు. తీసుకు వెళదామని బయటికి వెళ్తే ఎవరో ఇద్దరు ఉన్నారు. ఒకాయన నల్లగా మేఘంలా ఉన్నాడు. ఒకాయన ఎర్రగా ఉన్నాడు. కోదండాలు పట్టుకొని నిల్చున్నారు. హడలి లోపలికి వచ్చి కూర్చున్నాం. అన్నారు. ఆయన అప్పుడు బయటికి వెళ్ళి చూశారు. ఆయన ఏడ్చారు అప్పుడు. నిద్రపోకుండా స్వామీ నా పర్ణశాల ముందు కాపలా ఉన్నావా? మీరెంత ధన్యులురా..ఇన్నిమార్లు దర్శనం పొందారు, నాకు అవలేదు అని ఏడ్చారు. ఎవడు రాముణ్ణి నమ్మాడో వాడున్నచోట రాముడు ఉంటాడు తప్ప ఇంకొక చోట రాముడు ఉంటాడు అనుకోకండి. రామభక్తులెక్కడ ఉంటారో అక్కడే సీతారాములుంటారు. ఇది ప్రత్యేకించి రామావతారంలో మెండుగా కనిపిస్తోంది. త్యాగరాజ స్వామి విషయంలో, రామదాసు గారి విషయంలో. గంజి గుంటలో పడిపోయిన పిల్లవాడి శవాన్ని ఉడికిపోయిన దానిని తీసుకెళ్ళి రాముడి దగ్గర పెట్టి నువ్వు ఇచ్చిన కొడుకు, ఇవ్వాలనుకుంటే ఇవ్వు, లేకపోతే నీలో కలిపేసుకో. అంతరాలయంలో పెట్టి తలుపులు వేసి రామనామ భజన చేశాడాయన. పిల్లవాడు పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రి ఒళ్ళో పడుకున్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఈమధ్యనే కదా రామదాసు గారు. ఆయన వాడిన మంగళసూత్రంలో శతమానం కూడా మనం కల్యాణంలో చూస్తూనే ఉన్నాం కదా! రాముడు ఉన్నాడు. మీరు నమ్మండి. ఇప్పటికీ రాముడు తిరుగుతూనే ఉన్నాడు. మీరు నమ్మి ఉన్నచోట మీవెంట రాముడున్నాడు. మీరు పడుకుంటే మీరు పడుకున్నచోట ఉన్న కుర్చీలో ఆయన ఉంటాడు. ఎక్కడ రాముణ్ణి నమ్మిన వాడున్నాడో అక్కడే సీతారాములు కూడా ఉంటారు. అందుకే శాస్త్రంలో ఒక మాటుంది. రాముణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గం రామభక్తుణ్ణి తెచ్చుకోవడం. రామభక్తుడొస్తే సీతారాములొస్తారు.

Photo: భక్తులు ఎక్కడ ఉంటే రాముడు అక్కడ ఉంటాడు. ఇది సత్యం.

''శ్రీరంగం" టెంపుల్

ఆళ్వారుల దివ్వ ప్రబంధాలకూ, రామానుజుని శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం "శ్రీరంగం". "ఇండియన్ వాటికన్"గా పేరు పొందిన ఈ ఆలయం భారతదేశంలోని వైష్ణవ ఆలయాల్లోకెల్లా పెద్దది, సుందరమైనది. శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైయున్న ఈ దివ్యక్షేత్రం.. తమిళనాడులోని తిరుచ్చికి ఆనుకుని ఉండే ఉభయ కావేరీ నదుల మధ్యన విలసిల్లుతోంది.
భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సంకీర్ణాలలో ఒకటైన శ్రీరంగం ఆలయం.. 6,31,000 చదరపు మీటర్లు (156) ఎకరాల విస్తీర్ణంతో.. 4 కిలోమీటర్ల పొడవైన ప్రాకారంతో భాసిల్లుతోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాంబోడియాలోగల అంగ్‌కోర్ వాట్ దేవాలయం నేడు శిథిలావస్థలో ఉంది కనుక.. ప్రపంచంలో పూజాధికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం "శ్రీరంగం" ఆలయమేనని ఆలయ వెబ్‌సైట్ పేర్కొంటోంది.
కావేరీ నది, దాని ఉపనది కొలిదం మధ్యలో విస్తరించిన శ్రీరంగం ఒక ద్వీపంలా ఉంటుంది. శ్రీరంగ పట్టణంలో దేవాలయం ఉండడం కాక.. శ్రీరంగం దేవాలయంలోనే పట్టణం ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ అతిపెద్ద ద్రవిడ దేవాలయ గర్భాలయంలో విష్ణుమూర్తి ఆదిశేషుడిపై పక్కకి వరిగి శయనించిన భంగిమలో దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయం నాలుగు దశాబ్దాలపాటు అభివృద్ధి చెందింది.
ఈ ఆలయాన్ని మొదటిసారి పదో శతాబ్దంలో నిర్మించగా.. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తానుగా ఉన్నప్పుడు ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడు. ఆ తరువాత 1771వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అయితే ప్రస్తుతం ఉండే రంగనాథ ఆలయాన్ని 17వ శతాబ్దంలో నాయక రాజులు పునర్నిర్మించారు. దీని దక్షిమ మహాద్వారం 1987లో పూర్తి చేశారు.
శ్రీరంగంలో గర్భగుడి కేంద్రంగా ఎనిమిది దీర్ఘచతురస్రాకారపు ప్రాకారాలు ఒకదానిలోపల మరొకటి ఉన్నాయి. 15వ శతాబ్దందాకా ఈ ప్రాకారాలు ఏ కప్పూ లేకుండా ఉండేవి. లోపలి ఐదు ప్రాకారాలనూ ఆలయం లోపలి భాగాలుగా, బయటి మూడు ప్రాకారాలను నగరంగా, నివాస స్థలాలుగా తీర్చి దిద్దారు.
ఆలయంలోని అపూర్వ మంటపాలు, కట్టడాలు 17, 18 శతాబ్దాలలో నిర్మాణమయ్యాయి. శ్రీరంగంలో మొత్తం 21 గోపురాలుండగా.. తూర్పున ఉన్న గోపురంలో ముఖ్యమైన దేవుడిని ప్రతిష్టించారు. దీర్ఘచతురస్రాకారంగా ఉండే ఈ పీఠమే మొత్తం దేవాలయానికి గర్భగుడిగా, మూల స్థానంగా ప్రాచుర్యంలో ఉంది.

యక్ష ప్రశ్నలు – జవాబులు

మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో
ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి
లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ
బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని
పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి
వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు.
నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే
విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు.
చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే
నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో
అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ
సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ
తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి
పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ
దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ఆ
ప్రశ్నలు ఇవే!!!
ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో
72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు.
1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)
5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)
6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)
7. మానవునికి సహయపడునది ఏది? (ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును?
(పెద్దలను సేవించుటవలన)
9. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును?
(అధ్యయనము వలన)
10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన
సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల
అసాధుభావము సంభవించును.)
11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు?
( మౄత్యు భయమువలన)
12. జీవన్మౄతుడెవరు? (దేవతలకూ,
అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు)
13. భూమికంటె భారమైనది ఏది? (జనని)
14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)
15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల
ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో
తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో
అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)
17. తౄణం కంటె దట్టమైనది ఏది? (చింత)
18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)
19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)
20. రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది?
( యజ్ణ్జం చేయుటవలన)
21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)
22. రూపం ఉన్నా హౄదయం లేనిదేది? (రాయి)
23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని
రక్షించక పోవడంవలన)
24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)
26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి
బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి
అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)
28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)
29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)
30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? ( కూమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (అహింస)
38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (మనస్సు)
39. ఎవరితో సంధి శిధిలమవదు? (సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? (యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (సత్పురుషులు)
42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? (భూమి,
ఆకాశములందు)
43. లోకాన్ని కప్పివున్నది ఏది? (అజ్ణ్జానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (బ్రాహ్మణుడు వచ్చినప్పుడు)
45. మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు,
ధనవంతుడు, సుఖవంతుడు అగును? ( వరుసగా గర్వం,
క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో)
46. తపస్సు అంటే ఏమిటి? ( తన వౄత్బికుల ధర్మం ఆచరించడం)
47. క్షమ అంటే ఏమిటి? ( ద్వంద్వాలు సహించడం)
48. సిగ్గు అంటే ఏమిటి? (చేయరాని పనులంటే జడవడం)
49. సర్వధనియనదగు వాడెవడౌ? ( ప్రియాప్రియాలను సుఖ
దు:ఖాలను సమంగా ఎంచువాడు)
50. జ్ణ్జానం అంటే ఏమిటి? (మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం)
51. దయ అంటే ఏమిటి? ( ప్రాణులన్నింటి సుఖము కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? ( సదా సమభావం కలిగి వుండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? ( ఇంద్రియ నిగ్రహం)
56. స్నానం అంటే ఏమిటి? (మనస్సులో మాలిన్యం లేకుండా
చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? ( సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? ( ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు)
60. ఏది కాయం? ( సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? ( అజ్ణ్జానం)
62. డంభం అంటే ఏమిటి? (తన గొప్పతానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (తన భార్యలో, తన
భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (ఆశపెట్టి దానం ఇవ్వనివాడు;
వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ,
దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (మైత్రి)
67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? (అందరి ప్రశంసలుపొంది
గొప్పవాడవుతాడు)
68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు?
(సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (అప్పులేనివాడు, తనకున్న దానిలో
తిని తౄప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం?
(ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే
శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు?
(ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని
సమంగా చూసేవాడు)
72. స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? (నిందాస్తుతులందూ,
శీతోష్ణాదులందు, కలిమి లేములందూ,
సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై
అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై
ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు)

ఏడు మహా నరకాలు - ఘోర శిక్షలు

నారదుని హితవుపై రవంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ''ప్రేతపతి'' అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపచేయవలసిందిగా ఆదేశించాడు. దూత , ధనేశ్వరుని తనతో తీసుకు వెళ్తూ మార్గమధ్యం లోని నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు.

తప్తవాలుకం

''ఓ ధనేశ్వరా! మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాలిన శరీరాలతో దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తూ ఉంటారు. దీన్నే ''తప్త వాలుక నరకం'' అంటారు. అతిథులను పూజించనివారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవులను, వేదవిదులను, యజమానిని, కాళ్ళతో తన్నినవారి పాదాలను యమదూతలు ఎలా కాలుస్తున్నారో చూడు..

అంధతామిత్రం

ఈ నరకంలో సూది మొనల్లాంటి భయకర ముఖాలు కలిగిన పురుగులు, పాపాత్ముల శరీరాలను తొలచివేస్తుంటాయి. ఇది పదహారు రకాలుగా కుక్కలు, గద్దలు, కాకులు మొదలైన పక్షి జంతు సమన్వితమై ఉంటుంది. పరుల రహస్యాల్ని బయటపెట్టే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండించబడుతూ ఉంటారు.

క్రకచం

ఇది మూడో నరకం. ఇక్కడ పాపాత్ములను నిలువుగా, అడ్డంగా, ఏటవాలుగా, సమూలంగా, అంగాంగాలుగా రంపాలతో కోస్తూ ఉంటారు.

అసిపత్రవనం

నరకాలలో నాలుగోది అసిపత్రవనం. భార్యాభర్తలను విడగొట్టే లేదా తల్లిదండ్రుల నుండి వారి సంతానాన్ని ఎడబాటు కలిగించే పాపులు ఈ నరకం చేరి నిలువెల్లా బాణాలతో, అసిపత్రాలతో హింసించబడతారు. రక్తం కారుతుండగా, వెంబడిస్తున్న తోడేళ్ళకు భయపడి శోకాలు తీస్తూ, పరుగులు తీస్తూ ఉంటారు. విపరీతమైన హింస తో కూడిన ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది.

కూటశాల్మలి

పర స్త్రీలను, పరుల ద్రవ్యాన్ని హరించిన వాళ్ళు, ఇతరత్రా అపకారాలు చేసిన వాళ్ళు ''కూటశాల్మలి'' నరకం చేరతారు. ఇక్కడ 16 రకాలుగా దండిస్తారు.

రక్తపూయం

ఇది ఆరవ నరకం. ఇక్కడ దుర్మార్గులు తలకిందులుగా వేళ్ళాడుతూ యమకింకరులచేత హింసించబడుతుంటారు. తినకూడనివి తిన్నవారు, ఇతరులను నిందించినవారు, చాడీలు చెప్పినవారు ఈ నరకం చేరతారు.

కుంభీపాకం

మొట్టమొదట నీకు విధించబడినది, ఘోరాతిఘోరమైనది, నరకాలన్నిటిలోకీ నికృష్టమైనది కుంభీపాక నరకం. అగ్నికీలలు, దుర్గంధాలతో కూడి ఉంటుంది.

రౌరవం

నరకాలలో ఎనిమిదవది అయిన ఈ రౌరవం దీర్ఘకాలికం. ఇందులో పడినవారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటపడలేరు.

ధనేశ్వరా! మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని, మనకు మనమై చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు. ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి. 1. అపకీర్ణం, 2. పాంక్తేయం, 3. మలినీకరణం, 4. జాతిభ్రంశం, 5. ఉపవీతకం, 6. అతిపాతకం, 7. మహాపాతకం
పైన చెప్పిన ఏడు రకాల నరకాల్లో ఆయా పాపాలు చేసినవారు శిక్షలు అనుభవిస్తూ, మగ్గుతున్నారు. కానీ, నువ్వు కార్తీక వ్రతస్తులైన వారి సాంగత్యం ద్వారా అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వల్ల ఈ నరకాలను కేవల దర్శనమాత్రంగానే తరించగలిగావు.

ఇలా చెప్తూ యమదూత అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు.

అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై, ధన యక్షుడనే పేరును పొందాడు. విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరచిన ధనయక్షతీర్థం ఇతని పేరుమీదనే సుమా. అందువల్ల శ్రీకృష్ణుడు ''సత్యభామా! పాపహారిణి, శోకనాశిని అయిన ఈ కార్తీక వ్రత ప్రభావంవల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు'' అని సత్యభామకు చెప్పి సాయంసంధ్యానుష్టానార్ధమై స్వీయ గృహానికి వెళ్ళాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు.

Photo: ఏడు మహా నరకాలు - ఘోర శిక్షలు

మన సంతతికి మనం ఇవ్వవలసినది

దేనిని మనము చేర్చవలసి వుంటుంది? సుకృతములా లేక దుష్కృతములా?
మన సంతతి మన కర్మఫలములను మోసేవారు. మనము మన పూర్వీకుల కర్మ ఫలముల భారమును మోయుచున్నాము. అందువల్ల మనమందరు కర్మఫలములను మోయు వాళ్ళమే. 
మన పూర్వీకుల పాప పుణ్య ఫల ఫలితమే మనం. మన పాప పుణ్య ఫలమే మన సంతతి. అందుకే ఒక నానుడి 
"పూర్వజన్మ కృతం పాపం పుత్రరూపేణ బాధతే" అని చెప్పేవాళ్ళు . మన దేహం మన పూర్వీకుల అణువు నుండి వచ్చింది దీనినే ఆంగ్లేయులు జీన్స్ అంటారు. దీనిని శాస్త్రము సైన్సు రెండు ఒప్పుకుంటుంది అందుకే మనము వైద్యుని వద్దకు చికిత్స నిమిత్తం వెళ్లినప్పుడు ఈ బాధ మీ వంశంలో నాన్నకో, తాతకో, ముత్తాతకో వున్నదా? వారు దీని వల్ల బాధపడ్డారా? అని అడుగుతారు.
ఒక రోగము మట్టుకే కాదు వంశావళిగా వచ్చేది అణుకువ, బుద్ది, జ్ఞానం, వివేకం నడత, భావన, లాభ నష్టాలు, జయాపజయాలు అన్ని వంశావళిగా సంక్రమించేదే. పెద్దల వంశావళిగా మనకు సంక్రమించిన వ్యాధులకు చికిత్స ఎలా తీసుకుంటామో అదే విధముగా మనకు సంప్రాప్తించే పాప నివృత్తికి కూడా పరిహారాదులు దైవీకముగా చేసుకోవలసి వుంటుంది.
మనకు బోధించే శాస్త్రములు యేమని గమనించితే తెలుస్తుంది. నువ్వు చేసే పాపకృత్యములు ఎవ్వరూ చూడడంలేదు అనే నీ అజ్ఞానం కేవలం అపోహే. నీలోని నీ అణువాంకురమైన నీ పిల్లలు తగిన తరుణమునకు వేచి వున్నారు. వారు పడే బాధ నీ కర్మఫలమే అనేది అప్పుడు గ్రహించగలవు.
మన సంతతి మన దుష్కృతముల వల్ల బాధపడకూడదు అనుకుంటే వారు బాగుపడటానికి మనం పుణ్యకార్యములు చేయవలసి వుంటుంది. ఏది చేస్తే మన సంతతి సుఖ సంతోషములతో వుంటుంది అంటే మనము చేసే పుణ్య కార్యములు వాటి వల్ల. మన సంతతి ఎన్ని తరాలు సుఖపడుతారు అని శాస్త్ర వచనము చూద్దాము
౧. బీదలైన అన్నార్తులకు ఆహారం అమర్చడం వల్ల మూడు తరాలు సుఖములను అనుభవిస్తారు
౨. పుణ్య నదీ స్నానం సంకల్ప పూర్వకంగా చేయడం వల్ల మూడు తరాలు సుఖములు అనుభవిస్తారు
౩. కోవెలలో దీపము నిరంతరం వెలగటానికి ఏర్పాటుచేస్తే ఐదు తరాలు సుఖులుగా వుంటారు
౪.జాతిమతభేదం లేక అన్నదానం చేస్తే, బీద ఆడపిల్లకు వివాహమునకు సహాయము అందిస్తే ఐదు తరాలు సుఖులుగా వుంటారు
౫. లేమివల్ల పితృకార్యములు చేయలేని వాళ్లకు సహాయపడి వారిచేత చేయిస్తే ఆరు తరాలు సుఖులుగా వుంటారు
౬ దేవాలయ జీర్ణోద్ధరణకు సహాయ పడితే ఏడు తరాలు సుఖులుగా వుంటారు
౭. అనాధ ప్రేత సంస్కారమునకు సహాయ సంస్కారములు అందిస్తే తొమ్మిది తరాలు సుఖులుగా వుంటారు
౮ గో సంరక్షణ చేస్తే పదునాలుగు తరములు సుఖులుగా వుంటారు
౯ గయా క్షేత్రములో పితరులకు పిండ దానం చేయడం, మాతృగయలో తల్లికి పిండదానం చేయడం, వైదీకముగా సాలంకృత కన్యా దానము చేయడం వల్ల ఇరువది ఒక్క తరాలు సుఖులుగా వుంటారు
అందువల్ల మనము మన వల్ల మాలినంత పుణ్యకార్యములు చేద్దాం. మన సంతతికి మంచి మార్గం ఏర్పరుద్దాం!!

Kalabhairava astami:

We might have seen on south east side of siva temples a statue standing with dog as vahana, the foot adorn with bangles, snake adorn in waist, trisula, kapala, damaruka and pasam as ayudhams, having hair stood upwards with fire, and have moon also in the forehead. He will appear with two protruding teeth and look as if of ugraswarupa. Some puranas state that Lord parameswara had five issues and they are, ganesa, skanda, sasta, veera bhadra and bhairava. He was initiated to kill andhakasura and demon by paramesawara. That single swaroopa turned to 8 and again to 64 forms and killed all the demons. Devendra was pleased with their action and given 64 yoginies into marriage with 64 forms of bhairavas.
The bhairavas are decended from tatpurusha mukha of lord siva and they are, kala bhairava, martanada bhairava,kshetra bhairva, satru samhara bhairava, vatuka bhaivara, swarna akarshana bhairava ruru bhairava.
Kaarteeka masa Krishna paksha ashtami and margaseersha sukla paksha is termed as bhairava ashtami. On this day we have to worship bhairava. We should not take any food in the morning and after sun set do puja to bhairava and through out the night we should either read or hear about the stories and pravachanms ofbhairava without sleeping. This will begets us one year protection from akaala mrutyu and victory over enemies.

Photo: Kalabhairava astami:

Asta Bhairvas:

These eight forms of bhairavas were created who were positioned at various places in Kashi. These Bhairavs protect the devotees from all sorts of evils and give the devotees happiness and prosperity in their lives. Devotees who worship these Bhairavas will develop a strong mental frame work and will be courageous.

1. Bheeshan Bhairav (Bhoot Bhairav)
2. Samhara Bhairav
3. Unmatta Bhairav
4. Krodhana Bhairav
5. Kapala Bhairav (Laat Bhairav)
6. Asitanga Bhairav
7. Chanda Bhairav
8. Ruru Bhairav

Photo: Asta Bhairvas:

'ద్వాదశ మంజరీక స్తోత్రం'

సంసార సాగరంలో ఈదులాడుతూ తీరం తెలియక తల్లడిల్లుతున్నా, ఆ సాగరంపై వ్యామోహం వీడదు మనకు. ఎండమావుల వెంట పరుగులు తీస్తూంటాం; ఎడారి మంటలకు చలి కాచుకుంటూ ఉంటాం. మోహపు తెరలు కమ్ముకుంటున్నా, ఆ మాయాజాలపు మైకంలోనే మునిగిపోతున్నాం. కానీ ఆ మాయను సృజించిన మాధవుడే మళ్ళీ మనల్ని మేల్కొలిపేందుకు అవతార పురుషుల రూపంలో ఆగమిస్తాడు. "జీవితంలోని క్లిష్ట సమస్యలను ఆ భగవంతుడే పరిష్కరిస్తాడు. నిగూఢ విషయాలను సైతం ఎంతో సామాన్య విషయాల మాదిరిగానే అవలీలగా పసిపిల్లలకు కూడా బోధపడేలా బోధించగలడు. అతడి దివ్య తేజం తరతరాలుగా పేరుకుపోయిన అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది"అంటారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస. అలాంటి కోవకు చెందిన మహనీయులే ఆదిశంకరాచార్యులు. జ్ఞానాంజన ద్వారా మనిషి మనోనేత్రంలోని భేదభావ చట్వారాన్ని పరిహరించిన ప్రజ్ఞావంతులు వారు. ఆ పరంపరలో శంకరాచార్యులు మానవాళికి అందించిన అద్భుత 'భజగోవిందం'.
ఒకరోజు శిష్య సమేతులై శంకరాచార్యుల వారు కాశీనగర వీధుల్లో పయనిస్తూ ఉన్నారు. దూరంగా ఓ ఇంటిముందు వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేస్తున వృద్ధ బ్రాహ్మణున్ని చూశారాయన. జీవిత సంధ్యా సమయంలో కూడా భగవంతుడిపై దృష్టి మరల్చక, లౌకికమైన జ్ఞానం కోసం తపిస్తున్న ఆ వ్యర్థ జీవిపై సానుభూతి కలిగింది ఆదిశంకరులకు. వెంటనే అతనిని ఉద్దేశించి 'భజగోవిందం' శ్లోకాన్ని ఆశువుగా గానం చేశారు.
మానవుడి అస్తవ్యస్త జీవితాన్ని చూసి హృదయం ద్రవించిన శ్రీశంకరులు అంతటితో ఆగక, మానవజీవన వికాసానికి దోహదపడే పన్నెండు శ్లోకాలు చెప్పారు. వీటినే 'ద్వాదశ మంజరీక స్తోత్రం' అంటారు. శంకరాచార్యుల వారిని అనుసరించి నడుస్తున్న పధ్నాలుగు మంది శిష్యులు ఆచార్యుల వారి బోధతో ఉత్తేజితులై ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చొప్పున పద్నాలుగు శ్లోకాలు చెప్పారు. వీటిని 'చతుర్దశ మంజరీక స్తోత్రం' అంటారు. శిష్యులు రచించిన ఈ చతుర్దశ మంజరీక స్తోత్రాన్ని ఆలకించి సంతృప్తి చెందిన పూజ్యపాదులు ఆశీర్వచనంగా చివరి నాలుగు శ్లోకాలు చెప్పారు. మొత్తం కలిసి ముప్పది శ్లోకాలుగా ఏర్పడిన ఈ గ్రంథం 'భజగోవిందం' అనే పేరుతొ ప్రాచుర్యం పొందింది. మానవుని మనస్సులోని మొహాన్ని పారద్రోలే శక్తి గలది కనుక దీనిని 'మోహముద్గరం' అని కూడా పిలుస్తారు.

Photo: సంసార సాగరంలో ఈదులాడుతూ తీరం తెలియక తల్లడిల్లుతున్నా, ఆ సాగరంపై వ్యామోహం వీడదు మనకు. ఎండమావుల వెంట పరుగులు తీస్తూంటాం; ఎడారి మంటలకు చలి కాచుకుంటూ ఉంటాం. మోహపు తెరలు కమ్ముకుంటున్నా, ఆ మాయాజాలపు మైకంలోనే మునిగిపోతున్నాం. కానీ ఆ మాయను సృజించిన మాధవుడే మళ్ళీ మనల్ని మేల్కొలిపేందుకు అవతార పురుషుల రూపంలో ఆగమిస్తాడు. "జీవితంలోని క్లిష్ట సమస్యలను ఆ భగవంతుడే పరిష్కరిస్తాడు. నిగూఢ విషయాలను సైతం ఎంతో సామాన్య విషయాల మాదిరిగానే అవలీలగా పసిపిల్లలకు కూడా బోధపడేలా బోధించగలడు. అతడి దివ్య తేజం తరతరాలుగా పేరుకుపోయిన అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది"అంటారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస. అలాంటి కోవకు చెందిన మహనీయులే ఆదిశంకరాచార్యులు. జ్ఞానాంజన ద్వారా మనిషి మనోనేత్రంలోని భేదభావ చట్వారాన్ని పరిహరించిన ప్రజ్ఞావంతులు వారు. ఆ పరంపరలో శంకరాచార్యులు మానవాళికి అందించిన అద్భుత 'భజగోవిందం'.
ఒకరోజు శిష్య సమేతులై శంకరాచార్యుల వారు కాశీనగర వీధుల్లో పయనిస్తూ ఉన్నారు. దూరంగా ఓ ఇంటిముందు వ్యాకరణ సూత్రాన్ని వల్లెవేస్తున వృద్ధ బ్రాహ్మణున్ని చూశారాయన. జీవిత సంధ్యా సమయంలో కూడా భగవంతుడిపై దృష్టి మరల్చక, లౌకికమైన జ్ఞానం కోసం తపిస్తున్న ఆ వ్యర్థ జీవిపై సానుభూతి కలిగింది ఆదిశంకరులకు. వెంటనే అతనిని ఉద్దేశించి 'భజగోవిందం' శ్లోకాన్ని ఆశువుగా గానం చేశారు.
మానవుడి అస్తవ్యస్త జీవితాన్ని చూసి హృదయం ద్రవించిన శ్రీశంకరులు అంతటితో ఆగక, మానవజీవన వికాసానికి దోహదపడే పన్నెండు శ్లోకాలు చెప్పారు. వీటినే 'ద్వాదశ మంజరీక స్తోత్రం' అంటారు. శంకరాచార్యుల వారిని అనుసరించి నడుస్తున్న పధ్నాలుగు మంది శిష్యులు ఆచార్యుల వారి బోధతో ఉత్తేజితులై ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చొప్పున పద్నాలుగు శ్లోకాలు చెప్పారు. వీటిని 'చతుర్దశ మంజరీక స్తోత్రం' అంటారు. శిష్యులు రచించిన ఈ చతుర్దశ మంజరీక స్తోత్రాన్ని ఆలకించి సంతృప్తి చెందిన పూజ్యపాదులు ఆశీర్వచనంగా చివరి నాలుగు శ్లోకాలు చెప్పారు. మొత్తం కలిసి ముప్పది శ్లోకాలుగా ఏర్పడిన ఈ గ్రంథం 'భజగోవిందం' అనే పేరుతొ ప్రాచుర్యం పొందింది. మానవుని మనస్సులోని మొహాన్ని పారద్రోలే శక్తి గలది కనుక దీనిని 'మోహముద్గరం' అని కూడా పిలుస్తారు.

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశత నామస్తోత్రము

ఓం శరవణభవాయ నమః
ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః
స్కందో గుహష్షణ్ముఖ శ్చ ఫాలనేత్రసుతః ప్రభుః
పింగళః కృత్తికాసూను శ్శిఖివాహో ద్విషడ్భుజః
ద్విషణ్ణేత్ర శ్శక్తిధరః పిశితాశప్రభంజనః |
తారకాసురసంహారీ రక్షోబలవిమర్దనః ||
మత్తః ప్రమత్తోన్మత్త శ్చ సురసైన్య స్సురక్షకః |
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళు ర్భక్తవత్సలః ||
ఉమాసుతశ్శక్తిధరః కుమారః క్రౌంచదారణః |
సేనానీ రగ్నిజన్మా చ విశాఖశ్శంకరాత్మజః ||
శివస్వామీ గణస్వామీ సర్వస్వామీ సనాతనః |
అనంతశక్తి రక్షోభ్యః పార్వతీ ప్రియనందనః ||
గంగాసుతశ్శరోధ్భూత అహూతః పావకాత్మజః |
జృంభః ప్రజృంభ ఉజ్జృంభః కమలాసనసంస్తుతః ||
ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణ స్సుమనోహరః |
చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతిరహర్పతిః ||
అగ్నిగర్భ శ్శమీగర్భో విశ్వరేతా స్సురారిహా |
హరిద్వర్ణ శ్శుభకరః పటుశ్చ పటువేషభృత్‌ ||
పూషా గభస్తిర్గహనః చంద్రవర్ణః కళాధరః |
మాయాధరో మహామాయీ కైవల్య శ్శంకరాత్మజః ||
విశ్వయోని రమేయాత్మా తేజోనిధి రనామయః |
పరమేష్ఠీ పరబ్రహ్మా వేదగర్భో విరాట్సుతః ||
పుళిందకన్యాభర్తా చ మహాసారస్వతావృతః |
ఆశ్రితాఖిలాదాతా చ చోరఘ్నో రోగనాశనః ||
అనంతమూర్తి రానంఠః శిఖిండికృత కేతనః |
డంభః పరమడంభశ్చ మహాడంభో వృషాకపిః ||
కారణోత్పత్తిదేహశ్చ కారణాతీ(నీ) తవిగ్రహః |
అనీశ్వరో-మృతః ప్రాణః ప్రాణాయామపరాయణః ||
విరుద్ధహంతా వీరఘ్నోరక్తాస్యశ్శ్యామకధరః |
సుబ్రహ్మణ్యో గుహః ప్రీతో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శత నామ స్తోత్రము సంపూర్ణము